ఈ నెల 11 వరకు ఆర్యన్ కస్టడీ కోరిన ఎన్సీబీ.. మరిన్ని ఆధారాల కోసం విచారణ

NCB Ask to Court for Aryan custody until 11 this month
NCB Ask to Court for Aryan custody until 11 this month

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను ముంబై కోర్టు విచారించి ఎన్సీబీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. అయితే.. కోర్టు ఆర్యన్ ను ఈ నెల 7 వరకు కస్టడీలో ఉంచాల్సిందిగా ఆదేశించింది. అయితే.. ఆ కస్టడీని ఈ నెల 11 వరకు పొడిగించాలని ఎన్సీబీ కోర్టును కోరింది.

NCB Ask to Court for Aryan custody until 11 this month
NCB Ask to Court for Aryan custody until 11 this month

ఆర్యన్ ఖాన్ ఫోన్ లో ఫొటోల రూపంలో డ్రగ్స్ కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలన్నీ ఉన్నాయని ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణాతో ఈ కేసులకు సంబంధం ఉందని ఫొటోల ద్వారా తేలిందని కోర్టుకు ఎన్సీబీ నివేదించింది. భారీగా డ్రగ్స్ సేకరించి దేశంలో పలు ప్రాంతాల్లో సప్లై చేసే కుట్ర దాగి ఉందని కోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్సీబీ పొందు పరిచింది. కాగా.. మారు వేషాల్లో తాము జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికాయని.. మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీ గడుపు పెంచాలని ఎన్సీబీ కోర్టును కోరింది.