జైల్లో కొడుకును కలిసిన కొద్దిసేపటికే.. షారుక్ ఇంటికి ఎన్సీబీ అధికారులు

shahrukh khan son aryan khan health in trouble
shahrukh khan son aryan khan health in trouble

నిషేధిత డ్రగ్స్ వాడిన కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈరోజు షారుక్ ఖాన్ ఆర్ధర్ రోడ్డులోని జైలులో ఉన్న కొడుకు ఆర్యన్ ఖాన్ ను కలిశాడు. షారుక్ కొడుకును కలిసి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ఎన్సీబీ అధికారులు షారుక్ నివాసానికి వెళ్లారు. కొడుకు డ్రగ్స్ కేసులో షారుక్ ను పలు ప్రశ్నలు అడగనున్నారు.

ncb Officers went to Sharukh Khan House
ncb Officers went to Sharukh Khan House

షారుక్ ఇంటి నుంచి ఎన్సీబీ అధికారులు నేరుగా బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంటికి కూడా వెళ్లారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ కు రెండుసార్లు బెయిల్ తిరస్కరణకు గురయింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్ లో అనన్య పాండే పేరు కూడా ఉన్నందున ఎన్సీబీ అధికారులు ఆమెను కూడా విచారించనున్నారు. ఇప్పటికే అనన్యకు అధికారులు సమన్లు జారీ చేశారు. ఈరోజు విచారణకు కూడా హాజరైంది. కాగా.. ఈ కేసు అక్టోబర్ 26న బాంబే హైకోర్టు విచారించనున్నది. అప్పటి వరకు ఆర్యన్ ఖాన్ జ్యుడిషియల్ కస్టడీలోనే ఆర్థర్ జైలులో ఉంటాడు.