రోహిత్ శర్మకు మహిళా లోకం ఫిదా… ఒకే ఒక్క డైలాగ్ తో పిచ్చెక్కించాడు..!

Netizens Impressed With Rohith Sharma Latest Post
Netizens Impressed With Rohith Sharma Latest Post
Netizens Impressed With Rohith Sharma Latest Post
Netizens Impressed With Rohith Sharma Latest Post

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

రోహిత్ శర్మ.. గ్రౌండ్ లోకి దిగాడంటే బౌలర్లకి చుక్కలు కనబడటం ఖాయం. కళాత్మకమైన విధ్వంసం సృష్టించడంలో రోహిత్ ను మించిన వారు లేరు. ఇక, రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనోడి సారధ్యంలోనే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లను ఎగరేసుకుపోయింది. గ్రౌండ్ లో జట్టు బాధ్యతలు మోసే హిట్ మ్యాన్.. బయట తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. లేటెస్ట్ గా రోహిత్ శర్మ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.రోహిత్ శర్మ తన కూతురు సమైరా తో కలిసి వున్న ఓ ఫోటో ను పోస్ట్‌ చేశాడు.ఇక రోహిత్‌కు తన కూతురు సమైరా అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే.తన కూతురు కు సంబంధించి వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు.కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవాధికంగా వాయిదాపడటంతో ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రస్తుతం ఇంట్లోనే గడుపుతున్నాడు.ఈ నేపథ్యంలో తన గారాలపట్టి సమైరాను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఓ ఫొటోను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.దానికి “ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా” అనే క్యాప్షన్‌ ఇచ్చాడు.ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. అటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.