ఏం బాబర్ మత్తు దిగిందా.. అసలు నీకు కోహ్లీకి పోలికేంటి.. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ పై తీవ్ర విమర్శలు..!

Netizens Trolling On Pakistan Cricketer Babar Azam For Poor Performance With Bangladesh
Netizens Trolling On Pakistan Cricketer Babar Azam For Poor Performance With Bangladesh

పాకిస్తాన్ లో నంబర్ బ్యాట్స్ మెన్ గా కీర్తించే స్టార్ క్రికెటర్ బాబర్‌ అజమ్‌ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తన కెరీర్ లో ఇప్పటివరకు ఇంత పేలవ ప్రదర్శన ఇవ్వలేదని సొంత దేశంలో తిట్టిపోస్తున్నారు. విరాట్ కోహ్లీ కంటే గొప్ప అంటూ పాకిస్తాన్ సోషల్ మీడియా రోజు బాబర్ గురించి పిచ్చి రాతలు రాస్తూనే ఉంటుంది. టి20లు మినహాయిస్తే.. వన్డే, టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ దరిదాపుల్లో లేని బాబర్ ని ఒక సూపర్ హీరోగా పాకిస్తాన్ లో చూస్తుంటారు. ఇప్పుడిప్పుడే ఇంటర్నెషినల్ క్రికెట్ లో నడక నేర్చుకుంటున్న    బాబర్ కి.. దిగ్గజ క్రికెటర్స్ లిస్టులో చేరిపోయిన విరాట్ కోహ్లీకి పోలిక ఏంట్రా కాలి ఫ్లవర్స్ అని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంత తిట్టినా.. పాకిస్తానీలకు పట్టనే పట్టదు.

అయితే ఇన్నాళ్ళకి వారికి తత్వం బోధపడిందనుకుంటా.. బంగ్లాదేశ్ పై బాబర్ అజమ్ ప్రదర్శనని తిట్టిపోస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్. బంగ్లాదేశ్‌లాంటి చిన్న జట్టుతో జరిగిన 3 టి20ల సిరీస్‌ను పాకిస్తాన్ అదృష్టం కొద్దీ.. అతికష్టంగా గెలుచుకుంది. ఎప్పుడు ఎవడు ఎలా ఆడతాడో తెలియని          అన్ ప్రెడిక్టబుల్ టీమ్ పాకిస్తాన్. దీనికి తగ్గట్టే మొన్న యువ ఆటగాళ్లు కుల్‌దిష్‌ షా, ఫఖర్‌ జమాన్‌, మహ్మద్‌ నవాజ్‌లు అంచనాలకు మించి రాణించారు కాబట్టి సరిపోయింది.. లేదంటే బంగ్లా బౌలింగ్ ముందు పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయేదే. అయితే ఈ మూడు టి20 మ్యాచుల్లో బాబర్ అజమ్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా వచ్చే బాబర్‌ అజమ్‌ మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 7,1,19 పరుగులు మాత్రమే చేశాడు.ఈ సందర్భంగా బాబార్‌ అజమ్‌ చెత్త ప్రదర్శనపై అభిమానులు ట్రోల్‌ చేశారు. వరల్డ్‌కప్‌ గెలవలేకపోయామనే బాధ ఇంకా ఉన్నట్లుంది.. మత్తు దిగలేనట్టుంది.. అందుకే బం‍గ్లాతో సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్.