సీఎం కేసీఆర్ ను కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

New MLCs met CM KCR

ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి లు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

వీరంతా ఇవాళ ప్రగతి భవన్ కు చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. తమకు మరోసారి అవకాశం కల్పించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.