రాష్ట్రంలో కొత్తగా 3,980 కరోనా కేసులు.. 3 మరణాలు

carona-testing

రాష్ట్రంలో గత 24 గంటల్లో 97,113 నమూనాలను పరీక్షించగా.. 3,980 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1439, మేడ్చల్ 344, రంగారెడ్డి 234, హనుమకొండ 159, ఖమ్మం 110 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 2,398 మంది కరోనా నుంచి కోలుకోగా.. తాజాగా కరోనాతో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.89 శాతం, కేసు ఫెటలిటీ రేటు 0.55 శాతంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.