వైజాక్ చెందిన నర్సింగ్ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్న ఎన్ఐఏ అధికారులు.. తెలంగాణా హైకోర్టు న్యాయవాదులు శిల్పా, దేవేంద్రను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ తో పాటు మెదక్ జిల్లా చేగుంటలో తనిఖీలు చేశారు.
న్యాయవాదులు శిల్పా, దేవేంద్ర, CMSO నాయకురాలు స్వప్న ..తమ కుతురు రాధను నక్సల్స్ లోకి పంపించారని ఆమె తల్లిదండ్రులు ఏపీలోని విశాఖపట్నంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా NIA కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇదే క్రమంలో ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్ లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప, పర్వత్ పూర్ లోని దేవేంద్ర ఇండ్లలో NIA అధికారులు సోదాలు జరిపారు. సాహిత్య పుస్తకాలను సీజ్ చేశారు.
హైదరాబాద్ లో వైద్య పరీక్షల తర్వాత విజయవాడ కోర్టు ముందు ముందు హాజరు పరుచనున్నారు NIA అధికారులు .