ఇక సీరియల్స్ లో నో కౌగిలింతలు, నో రొమాన్స్. కాదని తీస్తే చర్యలే

సీరియల్స్ లో ట్రెండ్ ఛేంజ్ అయ్యింది. కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచిలోనూ చాలా మార్పులు వస్తున్నాయి. దాన్ని ఆసరగా ప్రేక్షకులు టేస్ట్ కు తగినట్లుగా సీరియల్స్ తీయాల్సినప్పటికీ చాలా మంది డైరెక్టర్లు దారి తప్పుతున్నారు. జస్ట్ కౌగిలింతలు, రొమాన్స్ నే నమ్ముకుంటున్నారు. దీంతో ఫ్యామిలీ మొత్తం చూసే సీరియల్స్ లో చాలా వరకు రొమాన్స్ సీన్లు వస్తున్నాయి. ఇది చాలా కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. మితిమీరిన హింస, ఫ్యామిలీ బంధాలను చెడగొట్టే సీన్లు ఉంటున్నాయి.

పాకిస్తాన్ ప్రభుత్వం ఆగ్రహం

ఇటీవల కాలంలో టీవీల్లో సీరియల్స్ లో రొమాన్స్ సీన్లు ఎక్కువ అయ్యాయి. దీనిపై ప్రభుత్వానికి చాలా కంప్లైంట్లు రావటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీరియల్స్ లో కౌగిలించుకోవటం, రొమాన్స్ సీన్లు ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యూలేటరీ అథారిటీ(పీఈఎంఆర్‌ఏ) తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇలాంటి సన్నివేశాలు ప్రసారం చేయటం పాకిస్తాన్ సమాజానికి మంచిదికాదని నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఇస్లామిక్ సంస్కృతికి విరుద్ధం

‘‘వివాహేతర సంబంధాలు, బెడ్ రూమ్ సీన్స్, కౌగిలింతల సన్నివేశాలు, అసభ్యకరమైన దుస్తులు వేసుకున్నట్లు చూపించటం పాకిస్తాన్ సమాజాన్ని తప్పుదోవ పట్టించటమే. ఇస్లామిక్ బోధనలకు ఇలాంటి చర్యలు పూర్తి వ్యతిరేకమని పీఈఎంఆర్ఏ తెలిపింది. సీరియల్స్ ను ఒకటికి రెండుసార్లు పరిశీలించి అసభ్యత లేకుండా తీయాలని కోరింది. ఈ నిర్ణయంపై హ్యుమన్ రైట్స్ ప్రొఫెషనల్ లాయర్ రీమా ఒమర్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యంగ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.