ఇకపై ఇంటర్నెట్ లేకున్నా.. డిజిటల్ లావాదేవీలు.. జస్ట్ ఇలా చేయండి - TNews Telugu

ఇకపై ఇంటర్నెట్ లేకున్నా.. డిజిటల్ లావాదేవీలు.. జస్ట్ ఇలా చేయండిNo Need Internet For Digital Payments Now
No Need Internet For Digital Payments Now

ఇప్పుడు ఏ చిన్న వస్తువు కొన్నా.. గూగుల్ పే ఉందా.. ఫోన్ పే ఉందా? అంటూ అడుగుతున్నారు. మొదట్లో ఇబ్బంది పడ్డా.. క్రమంగా జనాలు డిజిటల్ పేమెంట్స్ కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే ఫోన్ పే, గూగుల్ పే యూజర్ల సంఖ్య పెరిగింది. దీనికి తోడు.. నోట్ల ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా ఆన్ లైన్ పేమెంట్లు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే.. సిగ్నల్ సరిగ్గా లేక.. బ్యాంకు సర్వర్లు సతాయించడం వల్ల చాలాసార్లు పేమెంట్ ట్రాన్సాక్షన్ మధ్యలోనే ఆగిపోయి డబ్బులు కట్ అయి ఇబ్బంది పడ్డవారు చాలామందే ఉన్నారు. అయితే… ఇకపై ఆ ఇబ్బందులకు చెక్ పడనుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కి నగదు పంపించవచ్చు. ఆ సౌకర్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది.


ఇలా చేస్తే సరి..
ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసి ఉన్న నెంబర్ నుంచి స్మార్ట్ ఫోన్ లో *99# అని టైప్ చేయండి. కాలింగ్ బటన్ ప్రెస్ చేయగానే.. ఒక మెనూకు నావిగేట్ అవుతుంది. అందులో 1 నొక్కితే మనీ సెండ్, 2 నొక్కితే డబ్బుల కోసం రిక్వెస్ట్ పెట్టడం, 3 నొక్కితే బ్యాలెన్స్ చెక్, 4 నొక్కితే ప్రొఫైల్, 5 నొక్కితే పెండింగ్ రిక్వెస్టులు, 6 నొక్కితే అప్పటి వరకు చేసిన ట్రాన్సాక్షన్ల హిస్టరీ వస్తుంది. ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని.. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. ఇదంతా చేయడానికి ఇంటర్నెట్ అవసరం కూడా లేదు. జస్ట్ నార్మల్ ఫోన్ కాల్స్ చేసినట్టు చేస్తే సరి.