కరోనా పాజిటివ్ పేషంట్ కు రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నార్మల్ డెలివరీ చేశారు. వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన లకవత్ రజిత అనే గర్భిణీ కి పురిటి నొప్పులు రావడం తో ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బంధువులు తరలించారు.
రజితకు గత రెండు రోజుల క్రితమే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నెలలు నిండి పురిటి నొప్పులతో ఉన్న రజిత ను జిల్లా ఆసుపత్రికి పంపించే అంత సమయం లేకపోవడంతో ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రజితకు పురుడు పోశారు.
రజిత మగ బిడ్డకు జన్మనిచ్చిందని, తల్లి-బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని, అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ తెలిపారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, MCH పోగ్రాం అధికారి కపిల్ సాయి మార్గనిర్దేశాలతో ధైర్యంతో సాహసం చేసి పురుడు పోసినట్టు వైద్య సిబ్బంది తెలిపారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పుష్పలత, సుజాత, కీర్తి, సహకారం అందించిన ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిని పలువులు అభినందించారు. కేటీఆర్ సైతం జిల్లా వైద్య,ఆరోగ్య యంత్రంగాన్ని ట్విట్టర్ ద్వారా అభినందించారు.
Well done 👍 https://t.co/y6KyQkvLNU
— KTR (@KTRTRS) January 26, 2022