ఆనందంలో ఎన్టీఆర్‌, మెగా అభిమానులు.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి రిలీజ్ అప్డేట్

Release update from ‘RRR’

ఎస్‌.ఎస్‌. రాజమౌళి -ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్రబృందం బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే ఈ ఏడాది మార్చి 18న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ప్రేక్షకుల ముందుకు రానుంది. లేదంటే ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. తాజా ప్రకటనతో ఎన్టీఆర్‌, మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు కలుసుకుంటే ఎలా ఉంటుంది? బ్రిటిష్ వారిపై వారు ఏ విధంగా పోరాటం చేశారనే ఫిక్షనల్‌ కథతో ‘ఆర్ఆర్‌ఆర్‌’ను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు.

రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ రే స్టీవెన్‌సన్‌, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కీరవాణి మ్యూజిక్‌ డైరెక్టర్‌. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.