అధికారులు నిజాయితీగా కష్టపడి పని చేయాలి: బి. వినోద్ కుమార్

fever survey program is yielding good results says b.vinod kumar

fever survey program is yielding good results says b.vinod kumar

తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో..  అంశాల వారీగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరంగా కష్టించి పని చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డీ. లో ఇటీవల ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్స్ ఎంపికైన అభ్యర్థులకు నెల రోజుల ట్రైనింగ్ సెషన్ ను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ..  స్వరాష్ట్ర సాధన ఉద్యమ స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పాలనను సాగిస్తున్నామన్నారు. కోతల్లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న  విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు విక్రయించే స్థాయికి రాష్ట్రం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇటీవల జూనియర్ అసిస్టెంట్స్ గా ఎంపికైన అభ్యర్థులు తమ సర్వీస్ లో నిజాయితీగా, కష్టపడి పని చేసి పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ డీ అదనపు డైరెక్టర్ జెనరల్ హర్ ప్రీత్ సింగ్  తదితరులున్నారు.