ఈటల భూఆక్రమణలపై ఈరోజు సర్వే చేయనున్న అధికారులు

పేదల భూములు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబ భూ ఆక్రమణలపై ఈరోజు అధికారులు సర్వే చేయనున్నారు. హకీంపేటలో గల భూముల్లో సర్వే అధికారులు ఈరోజు ల్యాండ్ సర్వే చేయనున్నారు. ఇప్పటికే సర్వే డిపార్టుమెంట్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జమున హర్చరీస్ సంస్థకు నోటీసులు జారీ చేశారు.


ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులు మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయమై జూన్ నెలలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ కొవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాల కారణంగా సర్వే వాయిదా పడింది. కాగా.. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో అధికారులు హైకోర్టు ఆదేశాలతో ఈరోజు నుంచి విచారణ చేపట్టి, సర్వే కొనసాగించనున్నారు. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వే లక్ష్మీ సుజాత, ఎమ్మార్వో మాలతిల ఆధ్వర్యంలో 130 సర్వేనెంబర్ లోని 18 ఎకరాల్లో సర్వే కొనసాగుతున్నది.