ఒక్కడు మూవీ సీన్ రిపీట్.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రియురాలిని 11ఏండ్లు గదిలో దాచాడు

సినిమలో జరిగేవన్ని నిజజీవితంలో జరుగుతాయా ఏంటీ.. ? అది సినిమా బాబు.. ఇది జీవితం. అని డైలాగ్స్ కొట్టేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ కొందరి జీవితంలో కొన్ని సంఘటనలు సినిమాను తలపిస్తాయి. అచ్చం అలాంటి స్టోరీనే ఒకటి జరిగింది.

 

ఒక్కడు సినిమాను తలపిస్తున్న లవ్ స్టోరీ
ఒక్కడు సినిమాలో మహేష్ బాబు తన ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండా హీరోయిన్ ను తన ఇంట్లోనే దాచుతాడు. ఆ సన్నివేషం చూడడానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. కానీ నిజజీవితంలో కూడా సేమ్ అలాంటి సీనే రిపీట్ అయింది. తన ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఓ అమర ప్రేమికుడు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11ఏండ్లు తన ప్రియురాలిని ఓ గ‌దిలో దాచాడు. ఆమెకు ఏ చిన్న స‌మ‌స్య రాకుండా ప్రేమ‌గా చూసుకున్నాడు.

పాల‌క్క‌డ్ జిల్లాలోని అయిలూరు గ్రామానికి చెందిన ర‌హ‌మాన్, స‌జిత ఇద్దరు కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ర‌హ‌మాన్, సజిత ఇంటికి కొద్ది దూరంలో ఉంటున్నాడు. అయితే ఇద్ద‌రూ క‌లిసి ఒకేచోట ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో 2010, ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన ర‌హ‌స్యంగా స‌జితను త‌న ఇంట్లొ వళ్లకు కూడా తెలియకుండా.. ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో ఉన్న ఓ చిన్న గ‌దిలో స‌జిత‌ను ఉంచాడు. ఆ గ‌దికి ఉన్న కిటికీల గ్రిల్స్ ను తొల‌గించి, ర‌హ‌స్యంగా డోర్ ఏర్పాటు చేశాడు. ఆ గ‌ది త‌లుపుకు ఉండే గ‌డియ‌కు విద్యుత్ ప్ర‌స‌రించేలా ఏర్పాటు చేశాడు. దీంతో ఆ గ‌డియ‌ను ఎవ‌రూ ముట్టుకున్న కరెంట్ షాక్ వ‌స్తోంది. త‌న ప్రియురాలు ఆ గ‌దిలో ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదని ఇలా ప్లాన్ చేశాడు. అలా 2010 నుంచి ఈ ఏడాది మార్చి వ‌ర‌కు అంటే దాదాపు 11 సంవత్సరాలు సజిత ఆ గ‌దిలోనే ఉన్న‌ది. ర‌హ‌మాన్ అమ్మ‌నాన్న‌తో పాటు చెల్లి ఆ ఇంట్లో ఉన్న‌ప్ప‌టికీ, స‌జిత అక్క‌డ ఉన్న‌ట్లు మాత్రం వారికి తెలియదు.


ఎన్ని రోజులైనా స‌జిత ఇంటికి తిరిగిరాకపోవడంతో తన తల్లి దండ్రులు సజిత అదృశ్య‌మైన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామంతో పాటు స‌మీప గ్రామాల‌ను గాలించారు. చాలా మందిని విచారించారు. అందులో ర‌హ‌మాన్ కూడా ఉన్నాడు. అయిన‌ప్ప‌టికీ రహమాన్ స‌జిత తన ఇంట్లో ఉంటున్న విష‌యాన్ని చెప్పలేదు.

ఇలా వెలుగులోకి..
అయితే తాజాగా రెహమాన్ సజితను తన ఇంటినుండి తీసుకెళ్లి స‌మీపంలో ఉన్న విత‌న్నాసెరీ గ్రామానికి వెళ్లాడు. అక్క‌డ ఇద్ద‌రూ క‌లిసి ఒక రూమ్ లో ఉంటున్నారు. ర‌హ‌మాన్ కనిపించకపోవడంతో అత‌ని కుటుంబ స‌భ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ర‌హ‌మాన్ ఉంటున్న ప్లేస్ ను కనుగొన్న పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. రహమాన్ తో పాటు స‌జిత కూడా అక్క‌డే ఉండ‌టంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత ర‌హ‌మాన్ ను విచారించగా సజిత 11ఏండ్లుగా తన వద్ద ఉన్న విషయాన్ని చెప్పాడు. ఈ వివ‌రాల ప్ర‌కారం.. 11 ఏండ్లుగా స‌జిత ఉన్న గ‌దిని కూడా పోలీసులు ప‌రిశీలించారు. ఈ కేసులో ర‌హ‌మాన్, స‌జిత‌ను కోర్టులో హాజ‌రుప‌రచ‌గా, వారిద్ద‌రూ క‌లిసి ఉండేందుకు కోర్టు అనుమ‌తిచ్చింది. దీంతో ర‌హ‌మాన్, స‌జిత ఆనందానికి అవధులు లేవు.