గోల్డ్ చైన్ పోయిందంటే…సొంత డబ్బులతో కొనిచ్చిన సిరిసిల్ల ఎస్పీ

సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ అవ్వ తన గోల్డ్ చైన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చేందుకు వస్తే తన పరిస్థితి చూసిన ఆయన సొంత డబ్బులతో చైన్ చేయించారు. ఎస్పీ చేసిన పనికి ఆ అవ్వ ఆయన సలాం కొట్టింది. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల జిల్లా తెనుగువారిపల్లెలో ఓ అవ్వ..పెళ్లికి వెళ్లింది. ఆ పెళ్లిలో ఆమె గోల్డ్ చైన్ పోయింది. ఐతే గత నెల పోలీస్ నేస్తం అనే కార్యక్రమంలో భాగంగా ఆ విలేజ్ కు ఎస్పీక రాహుల్ హెగ్డే వెళ్లారు. ఈ సందర్భంగా ఆ అవ్వ తన గోల్డ్ చైన్ పోయిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చలించిపోయిన ఎస్పీ తానే స్వయంగా బంగారు గొలుసు చేయించి ఇస్తానని హామీ ఇచ్చారు. సరిగ్గా నెల తర్వాత ఎస్పీ రాహుల్‌ హెగ్డే బంగారు గొలుసు చేయించి అవ్వకి ఇవ్వటంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ తనపై చూపించిన ప్రేమకి ఆనందభాష్పాలు రాల్చారు.