ఒమిక్రాన్ ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆంక్షలు

Shamshabad airport

దక్షిణాఫ్రికాలో ప్రమాదకర కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. ప్రయాణికుల వద్ద 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని ఎయిర్ పోర్ట్ ఆధికారులు స్పష్టం చేశారు.

ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాజిటివ్ గా తెలినవారిని హోం క్వారంటైన్ లో లేదా ఆస్పత్రిలో చేరాలని ఆధికారులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, సమీబియా, బోట్సువానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం, తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పరీక్షలో నెగిటివ్ అని తేలితేనే ఎయిర్ పోర్ట్ నుండి వెలుపలికి అనుమతిస్తున్నారు. లేదంటే క్వారెంటైన్ కు తరలిస్తున్నారు. ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు ఎయిర్ పోర్ట్ లో మరో రెండు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.