కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలివే…బీ అలర్ట్.

సౌత్ ఆఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియక హెల్త్ ఎక్స్ పర్ట్స్ కూడా పరేషాన్ అవుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒమిక్రాన్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఇంకా స్టడీ చేయాలని చెబుతోంది. సౌత్ ఆఫ్రికాలో డాక్టర్లు మాత్రం ఈ వేరియంట్ ను లైట్ తీసుకుంటున్నారు. సాధారణ కరోనా లక్షణాల కన్నా కూడా దీని తీవ్రత తక్కువగా ఉందంటున్నారు. దీని వ్యాప్తి మాత్రం వేగంగా ఉంటోందంట. కానీ ఇప్పటి వరకు వచ్చిన కరోనా వేరియంట్లతో పోల్చితే ఈ కొత్త వేరియంట్ లక్షణాలు మాత్రం ఢిపరెంట్ గా ఉన్నాయి.

భిన్నమైన లక్షణాలు

కరోనా వేరియంట్ లలో కామన్ గా రుచి కోల్పోవటం, వాసన కోల్పోవటమనే లక్షణం ఉండేది. డెల్టా వేరియంట్ లో ఐతే శ్వాస తీసుకోవటం కూడా చాలా సమస్యగా ఉండేది. ఇక అధిక జ్వరం, బలహీనత కూడా కనిపించేది. కానీ ఒమిక్రాన్ విషయానికొస్తే మాత్రం మూడే ప్రధాన లక్షణాలున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తో కరోనా సోకిన వారికి తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట ఉంటుందని సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ చెబుతున్నారు. శ్వాస సమస్యలు, తీవ్ర జ్వరం గానీ రుచి, వాసన కోల్పోవటం వంటి లక్షణాలు మాత్రం కనిపించటం లేదని అన్నారు. ఒమిక్రాన్ తో బయట జరుగుతున్నంత ప్రమాదం లేదని ఆయన స్పష్టం చేశారు.

జాగ్రత్తలు తప్పనిసరి

ఒమిక్రాన్ ఎఫెక్ట్ తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా రిలేటేడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. మాస్క్ పెట్టుకోవటం, సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయటం, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా కరోనాను తరిమికొట్టవచ్చంటున్నారు.