సౌతాఫ్రికాలో ఒమిక్రాన్.. టీమిండియా టూర్‌‌ రద్దేనా?

team-india

సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరుగనున్న టీమిండియా టూర్ పై సందేహాలు నెలకొన్నాయి. షెడ్యూల్‌‌ ప్రకారం వచ్చే నెల17 నుంచి ఇండియా, సఫారీ జట్ల మధ్య మూడు టెస్ట్ ‌లు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు జరగాల్సి ఉన్నాయి.

టీమిండియా వచ్చే నెల‌ 8 లేదా 9న సౌతాఫ్రికా బయలుదేరాల్సి ఉంది. కానీ టెస్ట్‌‌ మ్యాచ్ లు జరగాల్సిన జొహన్నెస్‌‌బర్గ్‌‌, ప్రిటోరియాలో కొత్త వేరియంట్‌‌ కేసుల నమోదు అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో టెస్ట మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

‘సౌతాఫ్రికాలో వాస్తవ పరిస్థితులు ఏంటనే దానిపై సీఎస్‌‌ఏ  క్లియర్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ ఇచ్చిన తర్వాతే ఏదైనా స్టెప్‌‌ తీసుకుంటాం. అప్పటివరకు షెడ్యూల్‌‌ ప్రకారమే టూర్‌‌ జరుగుతుంది. ముంబైలో కివీస్‌‌తో మ్యాచ్‌‌ తర్వాత టీమిండియా స్పెషల్‌‌ చార్టెడ్‌‌ ఫ్లైట్‌‌లో జొహన్నెస్‌‌బర్గ్‌‌ వెళ్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

ఒకవేళ షెడ్యూల్‌‌ ప్రకారం టూర్‌‌ జరిగినా.. క్వారంటైన్‌‌ రూల్స్ ‌ను మరింత స్ట్రిక్ట్‌‌ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఇండియా–ఎ టీమ్‌ పర్యటిస్తుంది. అక్కడి పరిస్థితులపై రిపోర్ట్‌‌ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక సౌతాఫ్రికాపై ట్రావెల్‌‌ బ్యాన్‌‌ నేపథ్యంలో బ్రిటిష్‌‌, ఐరిష్‌‌ గోల్ఫ్‌‌, రగ్బీ టీమ్‌‌లు వెనక్కి వెళ్లిపోయాయి. సౌతాఫ్రికాలో వచ్చే నెలలో జరగాల్సిన వరల్డ్​ జూనియర్​ విమెన్స్​హాకీ టోర్నమెంట్​ను నిలిపివేస్తున్నట్టు ఇంటర్నేషనల్​ హాకీ ఫెడరేషన్​ శుక్రవారం ప్రకటించింది.