ఫేస్‌బుక్ ప‌రిచ‌యం.. బాలిక‌ ఫోటోల‌తో బ్లాక్ మెయిల్

omplaint was lodged with the police against a young man who was harassing a girl he had met through Facebook

ఫేస్ బుక్ లో ప‌రిచ‌యైన బాలిక‌ను వేధింపుల‌కు గురి చేస్తున్న యువ‌కుడిపై కేసు న‌మోదు చేశారు పేట్ బాషీరాబాద్ పోలీసులు. సంగారెడ్డి జిన్నారం కు చెందిన రాహుల్(19).. కొంపల్లి కి చెందిన బాలికను ఫేస్బుక్ లో పరిచయం చేసుకున్నాడు. ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి తన గ్రామానికి తీసుకెళ్లి .. ఆ బాలిక వ్య‌క్తిగ‌త ఫోటోలు తీశాడు. అనంత‌రం ఆ ఫొటోలతో బ్లాక్ మెయిల్ కి పాల్పడుతూ బాలిక వ‌ద్ద నుండి రూ.57000 తీసుకున్నాడు. అంత‌టితో ఆగ‌క.. ఈ నెల 3వ తేదీన బాలిక తండ్రికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. బాలిక ద్వారా విష‌యం తెలుసుకున్న ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.