చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియాకు మరోసారి నిరాశే

team-southafrica

సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియాకు మరోసారి నిరాశే ఎదురైంది. తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.

ఆతిథ్య సౌతాఫ్రికా టీం 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా విజయంలో కీగన్‌ పీటర్సన్‌, కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కీలకంగా వ్యవహరించారు.

ఓవర్‌నైట్‌ స్కోరు 101/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్‌ (82: 113 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. వాండర్ డస్సెన్ (41*), తెంబా బవుమా (32*) మిగతా పని పూర్తి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, మహమ్మద్‌ షమి, శార్దూల్ ఠాకూర్‌ తలో వికెట్ పడగొట్టారు.

స్కోరు కార్డు:

టీమిండియా: 223/10(77.3 overs), 197/10(67.3)

సౌతాఫ్రికా: 210/10(76.2), 212/3(63.3)