దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

carona-testing

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,68,833 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 402 మరణాలు చోటు చేసుకున్నాయి.

గత 24 గంటల్లో కరోనా నుంచి 1,22,684 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 14,17,820 యాక్టివ్ కేసుల ఉన్నాయి.

ప్రస్తుతం పరికవరీ రేటు 94.83%, మరణాల రేటు 1.32% గా ఉంది. 16.66% శాతానికి కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేటు పెరిగింది.

మరోపక్క దేశంలో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తి సైతం కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 6,041 కరోనా ఒమిక్రాన్‌ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.