తిరుమలలో సీనియర్‌ సిటిజన్ల ఆన్‌లైన్‌ కోటా.. రేపు విడుదల

Tirumala

తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి సీనియర్‌ సిటిజన్లకు ఆన్‌లైన్‌ కోటాను రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శారీరక వికలాంగులు, సీనియర్ సిటిజన్‌ల కోసం ఆగస్టు-2022 నెలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు 1000 టోకెన్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ కేటగిరీ కిందకు వచ్చే భక్తులు ఈ టోకెన్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని తిరుమల రావాలని సూచించారు.