పులిపిల్లలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్న ఒరంగుటాన్‌.. వైరల్ వీడియో

మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తల్లిప్రేమ ఒకేలా ఉంటుంది. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెటిజనుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో ఒరంగుటాన్‌ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైరల్ అవుతోన్న ఈ వీడియోలో.. ఒక ఒరంగుటాన్‌ పులి పిల్లలను ఆడిస్తూ కనిపించింది. మూడు పులి పిల్లలతో ఒరంగుటాన్ ప్రేమగా లాలిస్తూ ఆడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ ఫుటేజ్ సౌత్ కరోలినాలోని మర్టల్ బీచ్ సఫారీ లోనిది. పులి పిల్లలకు పాలు పడుతూ ఎంతో ప్రేమ గా చూసుకుంటుంది ఆ ఒరంగుటాన్. దీనిని 2015లో రికార్డు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.