ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ర‌ద్దు.. కొత్తగా 7 డిఫెన్స్‌ కంపెనీలు.. జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని మోదీ

PM Modi Tour In Yaasa Cyclone Effected States
PM Modi Tour In Yaasa Cyclone Effected States

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్‌బీ) ని రద్దు చేసిన కేంద్రం.. దాని స్థానంలో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను విలీనం చేసి కొత్తగా 7 రక్షణ సంస్థలను ఏర్పాటు చేశారు. వీటిని ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశానికి అంకితం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా పీఎం మాట్లాడుతూ.. రాబోయే ఏడు ర‌క్ష‌ణ సంస్థ‌లు దేశ సైనిక బ‌లాన్ని మ‌రింత పెంచుతాయ‌న్నారు. పిస్టల్ నుంచి ఫైటర్ విమానం వరకు ఈ కంపెనీల్లోనే తయారు చేసేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు. గ‌త ఐదేండ్ల‌లో ర‌క్ష‌ణ ఎగుమ‌తులు 325 శాతం పెరిగాయ‌ని ప్ర‌ధాని చెప్పారు.
7 డిఫెన్స్ కంపెనీలు
మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్‌), ఆర్మ్‌డ్‌ వెహికిల్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్ (అవాని), అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (ఏడబ్ల్యూఈ ఇండియా), ట్రూప్స్ కంఫోర్ట్స్ లిమిటెడ్ (టీసీఎల్‌), యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్‌), ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐఓఎల్‌), గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (జీఐఎల్‌)