27 భాషల్లో ఓయూ వెబ్‌సైట్‌

Osmania University

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ రాష్ట్రాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల సౌకర్యార్థం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉన్న ఓయూ వెబ్‌సైట్‌ను 27 భాషల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వర్సిటీ అధికారులు తెలిపారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులు వర్సిటీలోని కోర్సులు, అడ్మిషన్లు ఇతర సమాచారాన్ని వారికి కావాల్సిన భాషలో విద్యార్థులు పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

తెలుగు, జర్మన్, నేపాలి, ఫ్రెంచ్, స్పానిష్​, మంగోలియన్, పర్షియన్, చైనీస్, హంగేరియన్, ఇండోనేషియన్ ​తదితర భాషల్లో ఓయూ వెబ్‌సైట్‌ను చూడొచ్చని ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్ ​యాదవ్​, సైట్ డిజైన్ ​టీం డైరెక్టర్ ​నవీన్​కుమార్​ తెలిపారు.