ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాక్‌ బ్యాటర్‌

Mohammed Rizwan

క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాక్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆదివారం ప్రకటించింది.

2021లో 29 టీ20 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్‌ అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ.. 134.89 స్ట్రైక్‌ రేట్‌తో 1,326 పరుగులు సాధించాడు. ఏకంగా 73.66 సగటుతో ఈ రన్స్‌ చేయడం విశేషం.

బ్యాటింగ్‌లో అత్యుత్తమంగా రాణించిన ఇంగ్లాండ్‌ క్రీడాకారిణి, వికెట్‌ కీపర్‌ ట్యామీ బ్యూమోంట్‌ ఐసీసీ ఉమెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎన్నికైంది. వీటితోపాటు మరిన్ని పురస్కారాలను ఐసీసీ ప్రకటించింది. మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు జాన్నెమన్‌ మలన్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. మెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌గా ఒమన్‌ ఆల్‌రౌండర్‌ ఆటగాడు జీషన్‌ మక్‌సూద్‌ను ఎన్నుకుంది.