ఓపెనర్లే కొట్టేశారు.. దాయాది చేతిలో చిత్తుగా ఓడిన భారత్

Pakistan Won By 10 Wickets Against India
Pakistan Won By 10 Wickets Against India
Pakistan Won By 10 Wickets Against India
Pakistan Won By 10 Wickets Against India

నువ్వా.. నేనా అన్నట్టు సాగాల్సిన మ్యాచ్ లో ఆది నుంచి భారత్ మీద పాకిస్తాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్ టూర్ లో పాకిస్తాన్ మీద ఓటమే ఎరుగని ఇండియా.. తొలిసారి చిత్తుగా ఓడింది. 10 వికెట్ల తేడాతో వరల్డ్ కప్ లో ఇండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కుంది. బ్యాటింగ్ లో చిత్తుచిత్తయిన భారత్.. కనీసం బౌలింగ్ కూడా ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేశారు. 20 ఓవర్ల మ్యాచ్ లో 152 పరుగులను అలవోకగా కొట్టి విజయాన్ని ఖాతాలో వేసుకుంది పాకిస్తాన్.


ఓపెనర్లుగా బరిలోకి దిగిన మహ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి.. 79 పరుగులు చేయగా.. బాబర్ ఆజామ్ 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు 68 పరుగులు చేసి పాక్ కు విజయాన్ని కట్టబెట్టారు. భారత బౌలర్లు ఘోరంగా విఫలమై.. కనీసం ఒక్క వికెట్ కూడా తీయకపోగా.. ధారాళంగా పరుగులిచ్చారు. టీమిండియా చరిత్రలోనే పాక్ మీద ఇది చెత్త రికార్డుగా క్రికెట్ ప్రేమికులు మండి పడుతున్నారు.