స్వాతంత్ర దినోత్సవం కంటే.. నా బ్రా కలరే ముఖ్యమారా మీకు.. పాకిస్తాన్ హీరోయిన్ ఫైర్..!

Pakistani Actress Mehwish Hayat's Independence Day Post Goes Viral After Netizens Comment on Her Bra
Pakistani Actress Mehwish Hayat's Independence Day Post Goes Viral After Netizens Comment on Her Bra
Pakistani Actress Mehwish Hayat's Independence Day Post Goes Viral After Netizens Comment on Her Bra
Pakistani Actress Mehwish Hayat’s Independence Day Post Goes Viral After Netizens Comment on Her Bra

పాకిస్తాన్ గురించి అక్కడి జనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిందు ద్వేష పునాదులపై ఏర్పడ్డ  పాకిస్తాన్ రోజురోజుకి పాతాళానికి దిగజారుతోంది. బుద్ధిలేని నాయకత్వం, తీవ్రవాదాన్ని వెదజల్లే సైన్యం తీరుతో బికారి దేశంగా మారిపోయింది. అక్కడి అధ్యక్ష భవనాన్ని పెళ్లిళ్లు, పేరంటాలకు అద్దెకిచ్చి వచ్చిన డబ్బుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిపాలన చేస్తున్నాడంటే అక్కడి పరిస్థితులు అర్ధం చేసుకోవచ్చు. ఆర్ధిక పరిస్థితులే కాదు అక్కడి ప్రజల్లో మానవత్వం కూడా మంటకలిసిపోతుంది. దేశంలో మహిళలకు గౌరవం ఉంటేనే ఆ గడ్డకి మనుగడ ఉంటుంది. కానీ పాకిస్తాన్ లో పరిస్థితులు వేరు. అక్కడి మహిళలపై జరుగుతున్న దారుణ దాడులు, అవమానాలు అంతా ఇంతా కాదు.

మొన్న ఆగస్టు 14న జరిగిన పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 300 మంది పాకిస్తాన్ మృగాళ్లు ఓ ఆడ‌కూతురును చుట్టుముట్టి గాలిల్లోకి ఎగిరేస్తూ, బట్టలు చింపేసి దాడి చేసిన ఘటన అంతర్జాతీయంగా కలకలం సృష్టించింది.
లాహోర్ లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద జెండా ఎగురవేసే కార్యక్రమం దెగ్గర ఓ మహిళా టిక్ టాకర్ తన స్నేహితులతో కలిసి టిక్ టాక్ వీడియో చేసుకుంటుంటే అక్కడున్న 300మంది పాకిస్తానీలు ఆ మహిళా టిక్ టాకర్ పై దాడి చేసి ఆమె చేతికున్నఉంగరం, చెవి రింగులు, మొబైల్ ఫోన్, రూ. 15 వేలను లాకొన్నారు. అయితే ఈ ఘటన మరువకముందే పాకిస్తాన్ లో మరో సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది.

స్వాతంత్రం రోజున మన ఇండియాలోని సెలబ్రెటీలు ఎలాగైతే సోషల్ మీడియాలో అందరికి శుభాకాంక్షలు పెడతారో.. పాకిస్తాన్ ప్రజలకు కూడా అక్కడి హీరోయిన్ మెహ్‌విష్‌ హయత్ కూడా తమ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసి.. దాని కింద ” ఐక్యమైన ప్రయత్నం.. దేవుడిపై విశ్వాసం ఉన్నప్పుడే మనం కలల పాకిస్తాన్‌ని వాస్తవంగా మార్చగలము. జెండాను ఎగురవేయడం సరిపోదు, నిజంగా ఈ దేశాన్ని గౌరవిస్తే .. ఆదర్శంగా ఉండాలి .. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు…” అని రాసుకొచ్చింది.

అయితే ఇంత గొప్పగా పాకిస్తాన్ గురించి అలోచించి రాసిన ఆ హీరోయిన్ పై పాకిస్తాన్ నెటిజన్స్ చేసిన ట్రోలింగ్ సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఆమె రాసిన గొప్ప వ్యాఖ్యలోని అర్ధం చూడాలి, లేద ఆమె పట్టుకున్న వారి     దేశ జండాని చూడాలి.. కానీ అక్కడున్నది పాకిస్తాన్ మృగాళ్లు. వాళ్ళు అవేవి చూడలేదు. వాళ్ళు చూసింది ఆ హీరోయిన్ ధరించిన తెల్లటి చుడిదార్ లోపల వేసుకున్న బ్రా కలర్ ఏంటని. అది పాకిస్తానీల బ్రతుకు అంటూ ఆ ట్రోలింగ్ చూసిన అంతర్జాతీయ సమాజం కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ హీరోయిన్ పాకిస్తాన్ దేశస్తులపై ఒక రేంజిలో ఫైర్ అయింది. మనషులు ఎంత వక్రబుద్దితో ఉన్నారో దీన్ని బట్టి తెలిసిపోతోందని మండిపడ్డింది. బ్రా కలర్ ఏదైతే మీకేంటని ప్రశ్నించింది. పాకిస్థాన్ కోసం పరిష్కరించాల్సిన అవసరం ఉన్న పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయని.. వాటిపై సమయం వెచ్చించాలని నెటిజన్లరు హయత్ సూచించారు. నిజానికి పాకిస్తాన్‌లో మహిళకు కనీస గౌరవం దక్కదు. నటీ నటుల్ని కూడా నీచంగా చూస్తారు. హయత్‌కు కూడా అలాంటి అనుభవమే ఎదురయింది.