ధోనీజీ.. రాహుల్.. ప్లీజ్ ఈ ఒక్క మ్యాచ్ మాకు వదిలేయండి.. పాక్ ప్రజల రిక్వెస్టులు మామూలుగా లేవు

Pakisthan Fans Plea to Dhoni For dont Won the Match Against Pakistan Post Goes Viral
Pakisthan Fans Plea to Dhoni For dont Won the Match Against Pakistan Post Goes Viral

మరికొన్ని గంటల్లో భారత్ – పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అటు రెండు దేశాల ప్రజలతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. చాలాకాలం తర్వాత రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించడంతో వరల్డ్ వైడ్ గా ఈ మ్యాచ్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మూడేళ్ల తర్వాత భారత్ – పాక్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి.

Pakisthan Fans Plea to Dhoni For dont Won the Match Against Pakistan Post Goes Viral
Pakisthan Fans Plea to Dhoni For dont Won the Match Against Pakistan Post Goes Viral

మూడేండ్ల క్రితం.. అంటే 2019లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ప్రపంచకప్ మ్యాచ్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ ని చిత్తుగా ఓడించి భారత్ ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. ఇప్పటి వరకు పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్ లో భారత్ ఒక్కసారి కూడా ఓడించలేదు. కాగా.. అదే ట్రెండ్ ను కంటిన్యూ చేసేందుకు ఇటు టీమిండడియా, మరోవైపు భారత క్రికెట్ ప్రేమికులు తహతహలాడుతున్నారు. పాకిస్థాన్ మాత్రం.. ఈ సారైనా మ్యాచ్ గెలిచి పరువు దక్కించుకోవాలని ఆలోచిస్తోంది.

అయితే.. ఈ సారి పాకిస్థాన్ ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తోందని, ఆ దేశంలోని ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారని దుబాయ్ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ సంఘటన అద్దం పడుతోంది. టీ20 ప్రపంచకప్ ను కవర్ చేయడానికి వచ్చిన పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు శనివారం రాత్రి దుబాయ్ స్టేడయంలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని వెళ్తున్న టీమిండియా మెంటార్ ధోని, ఓపెనర్ రాహుల్ ని విచిత్రమైన కోరిక కోరింది. స్టేడియంలో ఆమె కోరిన కోరిక పాకిస్థాన్ ప్రజలు, పాక్ క్రికెట్ అభిమానుల మనోభావాలను ప్రతిబింబించింది. రాహుల్.. ప్లీజ్ ఈ ఒక్క మ్యాచ్ మంచిగా ఆడకు.. ధోనిజీ ఈ ఒక్క మ్యాచ్ మాకు వదిలేయండి.. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్ మీరు గెలవండి.. అంటూ బతిమిలాడుతూ అడిగింది. పాక్ మహిళా జర్నలిస్ట్ కోరికకు.. రాహుల్ నవ్వి ఊరుకోగా, ధోని మాత్రం ఆడటమే మా పని కదా.. అంటూ బదులిచ్చాడు. ఇదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి మొబైల్ లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.