డ్రగ్స్ కేసులో నైజీరియన్ అరెస్ట్.. పోలీసుల అదుపులో నిందితులు

Panja gutta Police Caught Nigerian In Drugs Case At Banjara Hills
Panja gutta Police Caught Nigerian In Drugs Case At Banjara Hills

పంజాగుట్ట జీవీకే వద్ద డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్ ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, పంజాగుట్ట పోలీసులు కలిసి అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన డానియల్ ఒలేరియా జోసెఫ్ (33) 2014లో విద్యార్థి వీసాపై హైదరాబాద్ వచ్చాడు. కూకట్ పల్లిలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో చదువుకుంటూనే ఢిల్లీకి చెందిన జాన్ పాల్ అనే నైజీరియన్ తో ఏర్పడిన స్నేహం మాదకద్రవ్యాల వ్యాపారానికి దారితీసింది.

Panja gutta Police Caught Nigerian In Drugs Case At Banjara Hills
Panja gutta Police Caught Nigerian In Drugs Case At Banjara Hills

బంజారా హిల్స్ లోని జీవీకే మాల్ వద్ద డ్రగ్స్ అమ్మేందుకు డానియల్ వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ తో డానియల్ ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నాలుగు గ్రాముల కొకైన్, హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.