భీమ్లా నాయక్.. అఫీషియల్ మేకింగ్ వీడియో.. పవన్ వాకింగ్ స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా..! - TNews Telugu

భీమ్లా నాయక్.. అఫీషియల్ మేకింగ్ వీడియో.. పవన్ వాకింగ్ స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా..!Pawan Kalyan Bheemla Nayak - Making Glimpse
Pawan Kalyan Bheemla Nayak – Making Glimpse

టాలీవుడ్ లో రీసెంట్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. వకీల్ సాబ్ విజయవంతం కావటంతో ఆయన తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంతో పాటు `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్ చిత్ర షూటింగ్స్‌ జరుగుతున్నాయి.

కరోనా కారణంగా ఆగిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ షూటింగ్ ని లేటెస్ట్ గా మొదలుపెట్టారు మేకర్స్. నిన్న భీమ్లా నాయక్‌ డ్యూటీలో చేరారని తెలియజేస్తూ పోలీస్ యూనిఫార్మ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ పిక్ ని షేర్ చేసిన చిత్ర యూనిట్ నేడు మరో అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. ఏకంగా ఈ మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేసారు. షూటింగ్ స్పాట్ కి పవన్ ఎంట్రీ ఇస్తున్న షాట్ తో వీడియో మొదలవ్వగా.. త్రివిక్రమ్ సీన్ నరేషన్ చేస్తున్న షాట్, సెకండ్ హీరోగా చేస్తున్న దగ్గుపాటి రానా ఎంట్రీ షాట్స్ మేకింగ్ వీడియోలో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

ఇక పోలీస్ యూనిఫార్మ్ లో మరో గబ్బర్ సింగ్ లుక్స్ తో పవన్ స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పోలీస్ షర్ట్ మడతెట్టి.. సోలోగా యూనిఫార్మ్ లో నడుచుకుంటూ వస్తున్న పవన్ వాకింగ్ స్టైల్ మేకింగ్ వీడియోకే హైలైట్ అని చెప్పాలి. ఈ షాట్ అత్తారింటికిదారేది ప్రమోషినల్ వీడియోని పోలి ఉంటుంది. ఇక ఈ సినిమాలో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రను పవన్ కళ్యాణ్, అతనితో ఢీ కొట్టే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను రానా చేస్తున్నారు. తమన్ సంగీతం చేస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తాజా మేకింగ్ వీడియోతో తెలిపింది.