పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని బస్సు తగలబెట్టిన పవన్ కల్యాణ్ ఫ్యాన్

Pawan Kalyan Fan Burn A Bus In Ap Due To Petrol Price Hike
Pawan Kalyan Fan Burn A Bus In Ap Due To Petrol Price Hike
Pawan Kalyan Fan Burn A Bus In Ap Due To Petrol Price Hike
Pawan Kalyan Fan Burn A Bus In Ap Due To Petrol Price Hike

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారన్న కోపంతో ఏపీలో పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఆర్టీసీ బస్సు మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. జిల్లాలోని వెలిగండ్ల మండలం మొగుళ్లూరు గ్రామానికి చెందిన రామగిరి మాలకొండయ్య కొడుకు ఏడుకొండలు.. గురువారం రోజు ఉదయం పామూరు బస్టాండుకు వెళ్లాడు. అక్కడ బస్టాండులో నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సు దగ్గరికి వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న లీటర్ పెట్రోల్ ను బస్సు మీద పోసి నిప్పంటించాడు. బస్సు మంటల్లో చిక్కుకుపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కేకలు వేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని బస్సు తగలబెట్టిన పవన్ కల్యాణ్ ఫ్యాన్
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని బస్సు తగలబెట్టిన పవన్ కల్యాణ్ ఫ్యాన్

ప్రయాణికుల కేకలు విని బస్సులోకి ఎక్కిన యువకుడు ప్రభుత్వాలు ధరలు పెంచితే మీరెందుకు ప్రశ్నించడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రశ్నించే బాధ్యత మీకు లేదా అంటూ గట్టిగా అరుస్తూ.. చుట్టుపక్కల పరిసరాలను సైతం తగులబెట్టే ప్రయత్నం చేశాడు. తాను పవన్ కల్యాణ్ అభిమానిని అని, 2024లో ఆయన ముఖ్యమంత్రి కావాలన్నది తన కోరిక అని నినాదాలు చేశాడు. పెట్రోల్ ధరలు తగ్గించాలని.. అందుకే నిరసనగా బస్సు తగులబెట్టానని చెప్పాడు. తాను ధరించిన పవన్ కల్యాణ్ బొమ్మను అందరికీ చూపిస్తూ.. గట్టిగా అరుస్తున్న యువకుడిని స్థానికులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.