ఆ రోజు పవన్ తో జరిగింది ఇదే.. మంచు విష్ణు షాకింగ్ వీడియో..!

Pawan Kalyan Manchu Vishnu Conversation Behind The Alai Balai Stage
Pawan Kalyan Manchu Vishnu Conversation Behind The Alai Balai Stage
Pawan Kalyan Manchu Vishnu Conversation Behind The Alai Balai Stage
Pawan Kalyan Manchu Vishnu Conversation Behind The Alai Balai Stage

బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరా తరువాత ఏర్పాటు చేసే అలయ్ బలయ్ కార్యక్రమంలో నిన్న కొత్త సీన్ ఒకటి దర్శనమిచ్చింది. ఎంత రాజకీయ శత్రుత్వం ఉన్నా.. దసరా పండగ తరువాత ఒకర్నొకరు ఆలింగనం చేసుకుని స్నేహన్నీ, ప్రేమని పంచుకోవటం తెలంగాణ సంస్కృతి. అలాంటి అలయ్ బలయ్ కి హాజరైన సినీ స్టార్స్ పవన్ కళ్యాణ్, మంచు విష్ణులు నిన్న ఒకే స్టేజిపై ఎదురుపడ్డా.. ఎడమొహం పెడమొహం వేసుకుని కూర్చోవటం మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో తాజాగా ఈ ఇష్యు పై మంచు విష్ణు వీడియో ఒకటి విడుదల చేశాడు.

అందులో పవన్ కళ్యాణ్ మంచు విష్ణుని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. చేతిలో చెయ్యి వేసి విష్ణుతో స్నేహంగా మాట్లాడుతున్నాడు. పవన్ చెప్పిన అంశాలని శ్రద్దగా వింటూ మంచు విష్ణు వినయంగా వింటున్నఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నిన్న తిరుమల దర్శనానికి వెళ్లిన మంచు లక్ష్మి కూడా ఇదే అంశాన్ని చెప్పింది. అలయ్ బలయ్ స్టేజి వెనుక పవన్ కళ్యాణ్, మంచు విష్ణులు చాల ఆప్యాయంగా మాట్లాడుకున్నట్టు చెప్పింది. మీడియాలో చూపెట్టినట్టు వాళ్లిద్దరూ ఎడమొహం పెడమొహం వేసుకుని ఏంలేరని చెప్పింది. ఆమె చెప్పినట్టే వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు.