నువ్వెంత అంటే నువ్వెంత.. ఒకే వేదికపై భగ్గుమన్న.. పవన్, విష్ణుల కలహాలు..!

pawan kalyan manchu vishnu strange behavior at alai balai programme
pawan kalyan manchu vishnu strange behavior at alai balai programme
pawan kalyan manchu vishnu strange behavior at alai balai programme
pawan kalyan manchu vishnu strange behavior at alai balai programme

బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరా తరువాత అలయ్‌ బలయ్‌ కార్యక్రమాం ఆనవాయితీగా నిర్వహిస్తుంటారు. పార్టీలకు అతీతంగా రాజకీయనాయకులు ఈ వేడుకకి హాజరవుతుంటారు. ఎప్పటిలాగే దత్తన్న ఏర్పాటు చేసిన ‘అలయ్‌ బలయ్‌’లో.. ఈ సారి కనపడ్డ కొత్త సీన్ ఒకటి అందర్నీ షాక్ కి గురిచేసింది. రాజకీయాలు, సిద్ధాంతాలని పక్కనపెట్టి.. ఒకర్నొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే పద్దతితో ఏర్పాటు చేసే ఈ అలయ్‌ బలయ్‌ లో కూడా ఇద్దరు సినీ స్టార్స్ ఎడమొహం పెడమోహం వేసుకుని కూర్చోవటం.. సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతుంది. ఆ ఇద్దరు మరెవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరైతే.. తాజాగా మా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మంచు విష్ణు. దత్తన్న ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ ఈ అలయ్‌ బలయ్‌ కి ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు. అయితే ఇదే వేడుకకి మా అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు కూడా హాజరయ్యాడు. మొన్న జరిగిన మా ఎన్నికల ప్రచారంలో     ఈ ఇద్దరి హీరోల వర్గాలు చేసుకున్న విమర్శల పర్వం గుర్తొచ్చిందో ఏమోకానీ అలయ్‌ బలయ్‌ కాన్సెప్ట్‌కు పూర్తి వ్యతిరేకంగా కనిపించారు. ఇక్కడ కూడా ‘మా’ మంటలేనా అని అనుకునే విధంగా ప్రవర్తించారు.

అప్పటికే అలయ్‌ బలయ్‌ స్టేజ్‌పై మంచు విష్ణు ఉండగా పవన్ వచ్చారు. ఇద్దరూ డైరెక్ట్ గా ఎదురుపడ్డారు. కానీ మాటల్లేవ్. మాట్లాడుకోవడాల్లేవ్. ఒకరిమొహం మరొకరు చూసుకోలేదు. అదే స్టేజ్‌పై పవన్‌ ఓ మెమొంటో తీసుకుంటే.. నెక్స్ట్‌ విష్ణు వంతు వచ్చింది. మళ్లీ ఇద్దరూ ఫేస్‌ టు ఫేస్ ఎదురైనా సీన్ మాత్రం మారలేదు. ఈ సెకండ్ సీన్ లోను ఎడమొహం..పెడమొహమే. రగులుతున్నమోహంతో విష్ణు సైడ్ ఇస్తే.. విష్ణు మొహం కూడా చూడకుండా క్రాస్ అయిపోయాడు పవన్. ఇక ఆకరిగా మూడవ సీన్ లో.. స్టేజ్‌పై పవన్‌- విష్ణు పక్కపక్క సీట్లోనే కూర్చున్నా.. కుంపటిపై ఉన్నట్టు మొహాలు పెట్టుకున్నారు. చిరునవ్వు లేదు. ఆత్మీయత కనిపించలేదు. చాల ఇబ్బందికరంగానే ఇద్దరూ దత్తన్న ఇచ్చిన బంగ్ తాగుతూ స్ట్రేంజర్స్ మాదిరి ప్రవర్తించారు. ఇక మా ఎన్నికల ప్రచారంలో మంచు విష్ణు మాట్లాడుతూ..      మా సభ్యులు ఇండస్ట్రీ వైపు ఉంటారా.. పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా అనే నినాదంతో సక్సెస్ ఫుల్ కాగా.. మంచు ఫ్యామిలీని డీ కొట్టడంలో మెగా క్యాంప్ విఫలం చెందిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ ఏర్పడ్డ కలహాలే   ఈ అలయ్‌ బలయ్‌ లోను భగ్గుమన్నాయి అని వీరిద్దరి ప్రవర్తన చూసిన నెటిజన్స్ కామెంగ్స్ చేసుకుంటున్నారు.