బిర్యానీలకే రూ. 27 లక్షలైంది. అసలే దివాళాలో ఉన్న పాక్ బోర్డుకు ఇది మరో నష్టం - TNews Telugu

బిర్యానీలకే రూ. 27 లక్షలైంది. అసలే దివాళాలో ఉన్న పాక్ బోర్డుకు ఇది మరో నష్టంపాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి చూస్తుంటే పాపమనిపిస్తోంది. అసలే దివాళాలో ఉండటంతో ఆదాయం కోసం చాలా కష్టాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ తమ దేశానికి వచ్చి క్రికెట్ ఆడటానికి ఒప్పుకోవటంతో ఫుల్ ఖుషీ అయ్యింది. మస్త్ పైసలు వస్తాయని ఆశ పడింది. కానీ పాక్ బోర్డు అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. భద్రత కారణాల పేరు చెప్పి న్యూజిలాండ్ టూర్ రద్దు చేసుకుంది. ఫలితంగా ఆదాయం వస్తుందనుకొని పెట్టిన ఖర్చు కూడా పోయింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు లబోదిబోమంటోంది.

బిర్యానీలకే రూ. 27 లక్షలు

న్యూజిలాండ్ క్రికెటర్ లు తమ దేశానికి వచ్చి క్రికెట్ ఆడేందుకు ఒప్పుకోవటంతో పాక్ బోర్డు వారికోసం మస్త్ సెక్యూరిటీ పెట్టింది. ఐదుమంది ఎస్పీలు, 500 మంది ఎస్ఎస్‌పీల‌ను న్యూజిలాండ్ టీమ్ వెంటే ఉంచింది. వీళ్ల‌కుతోడు పాకిస్థాన్ ఆర్మీని కూడా ఇస్లామాబాద్‌, రావ‌ల్పిండిలో రంగంలోకి దిగింది. వీళ్లందరికీ రెండు పూటల బిర్యానీలు పెట్టింది పాక్ బోర్డు. ఆ ఖర్చే దాదాపు రూ.27 ల‌క్ష‌లు అయ్యింది. దీంతో పాక్ బోర్డు తలపట్టుకుంటోంది. టూర్లు రద్దు అయ్యిందని బాధపడుతూనే బిర్యానీలకు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వాలా అంటూ బాధపడుతోంది.