అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు మరోసారి పట్టం కట్టారు.. మంత్రి హరీష్ రావు

Minister Harish Rao and MP Prabhakar Reddy inaugurated the Glow Garden at Komati Pond in Siddipet town.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. సిద్దిపేటతో పాటు వరంగల్, ఖమ్మం, జడ్చర్ల, వికారాబాద్ లలో కూడా TRS విజయం సాధించిందిన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు TRS ప్రభుత్వ పనితీరుపై ఇచ్చిన సంపూర్ణ విశ్వాసమైన తీర్పు అని హ‌రీష్ అన్నారు.

పాలపొంగు లా వచ్చిన విజయాన్ని చూసి బీజేపీ పార్టీ నేతలు తమను తాము ఎక్కువగా ఊహించుకున్నారని దెప్పిపొడిచారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారని గుర్తుచేశారు.

కాంగ్రెస్, బీజేపీ లకు అభివృద్ధి ఎజెండా లేదని.. తప్పుడు ప్రచారాల పునాదులపై రాజకీయాలు చేస్తున్నారని విమ‌ర్శించారు. వారి మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఈ ఫలితాలతో మ‌రోసారి రుజువయ్యిందన్నారు.

సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్ధిపేటను రోల్ మోడల్ పట్టణంగా అభివృద్ధి చేశామ‌న్నారు. సిద్దిపేట ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పు మా బాధ్యతను మరింత పెంచింద‌న్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటను మరింత గొప్పగా అభివృద్ధి చేస్తాన‌న్నారు. కొత్త కౌన్సిల్ సభ్యుల కలిసి టీమ్ వర్క్ చేస్తామ‌న్నారు. ఇంత గొప్పతీర్పు ఇచ్చిన సిద్దిపేట ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాన‌ని మంత్రి హ‌రీష్ అన్నారు.