ప‌రిశ్ర‌మ‌ల‌కు 15 రోజుల్లోనే అనుమ‌తులు: మంత్రి కేటీఆర్

ktr

ఏడున్న‌రేండ్ల‌లో సీఎం కేసీఆర్ పాల‌న‌లో ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ హాటల్‌లో జ‌ర్మ‌నీ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ జ‌రిగింది. ఈ స‌ద‌స్సులో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ని రంగాల‌కు 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా అందుబాటులో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు సింగిల్ విండో విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమ‌తులు ఇస్తున్నామ‌న్నారు. అమెరికాలో కూడా టీఎస్ ఐపాస్ లాంటి చ‌ట్టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా 17,500 కంపెనీల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు క్లియ‌రెన్స్ ఇచ్చామ‌ని కేటీఆర్ చెప్పారు.

జ‌ర్మ‌నీ పెట్టుబ‌డుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఆహ్వానం ప‌లుకుతుంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు 2 వేల ఎక‌రాల స్థ‌లం అందుబాటులో ఉంద‌ని, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తామ‌న్నారు. జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వం, అక్క‌డి పారిశ్రామిక‌వేత్త‌ల‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌న్న ఆయన.. చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లే జ‌ర్మ‌నీ జీడీపీ వృద్ధికి స‌హ‌క‌రిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.