పార్లమెంట్ ని తాకిన పెట్రో సెగ.. టీఎంసీ ఎంపీల వినూత్న నిరసన

దేశవ్యాప్తంగా గ‌త కొన్ని నెల‌ల నుంచి పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతున్న నేపథ్యంలో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు వినూత్నంగా నిరసన చేపట్టారు.  పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు 61 సౌత్ అవెన్యూ నుంచి తృణ‌మూల్ ఎంపీలు సైకిల్‌పై పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం లీట‌ర పెట్రోల్ ధ‌ర రూ.100 దాటిన విషయం తెలిసిందే.

కొత్త సాగు చ‌ట్టాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ గిల్‌, మ‌నీష్ తివారీలు ఈ తీర్మానాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ తోపాటు సీపీఎం ఎంపీలు కూడా రైతుల నిర‌స‌న‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని నోటీసులు ఇచ్చారు. సీపీఎం ఎంపీలు క‌రీమ్‌, వీ శివ‌దాస‌న్‌.. 267 రూల్ కింద నోటీసు ఇచ్చారు.