రికార్డుకెక్కిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మళ్లీ పెంచారు

Petrol and diesel prices in your city today, check here

Petrol, diesel prices on August 24: Petrol price drops to Rs 101.49/ltr in Delhi

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలు రికార్డు సృష్టించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 80 డార్లు దాటడంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్ మీద మరో 25 పైసలు, డీజిల్ మీద 30 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గత ఎనిమది రోజుల్లో డీజిల్ ధర ఆరుసార్లుపెరిగింది. కాగా.. లీటర్ పెట్రోల్ ధర దేశలోనే ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.

ఎక్కడెక్కడ ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.101.89గా డీజిల్ ధ‌ర రూ.90.17 గా ఉండగా, ముంబైలో పెట్రోల్ ధర రూ.107.95గా.. డీజిల్ ధర 97.84 గా ఉంది. ఇక రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఒడిశా, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని ప‌లు న‌గ‌రాల్లో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.100 దాటింది.

 


ఆ రాష్ట్రంలో మాత్రం పెరగడం లేదు..
బీజేపీకి రాజ‌కీయంగా కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మాత్రం జులై 17 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు చమురుసంస్థలు కూడా ధరలుపెంచడం లేదు. ఉత్తర ప్రదేశ్ లో మే 4 నుంచి జూలై 17 వ‌ర‌కు లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.11.44, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.9.14 పెరిగింది. అంతేకాదు.. మిగతా రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్న చమురు సంస్థలు ఉత్తర ప్రదేశ్ లో ఆగ‌స్టు 18 నుంచి సెప్టెంబ‌ర్ ఐదవ తేదీ మ‌ధ్య కేంద్ర చ‌మురు సంస్థ‌లు నాలుగు సార్లు పెట్రోల్‌ ధరలు, ఏడు సార్లు డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాయి.