పెట్రోల్ ధర తగ్గింది.. గ్యాస్ ధర పెరిగింది

Petrol price has come down .. Gas price has gone up
Petrol price has come down .. Gas price has gone up

దేశంలో పెట్రోల్ ధరలు నామమాత్రంగా తగ్గాయి. గత కొద్దికాలంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ మీద ఆయిల్ కంపెనీలు 15 పైసలు తగ్గించాయి. దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.49, డీజిల్ ధర రూ.88.92కి చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.107.39, డీజిల్ ధర 96.33, చెన్నైలో పెట్రోల్ రూ.99.08 కాగా డీజిల్ ధర రూ.93.38, కోల్ కతాలో పెట్రోల్ ధర లీటరుకు 101.72 కాగా, డీజిల్ 91.84కి చేరింది. తాజాగా తగ్గించిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.40కి చేరగా.. డీజిల్ రూ.96.84కి చేరింది.

Petrol price has come down .. Gas price has gone up
Petrol price has come down .. Gas price has gone up

పెట్రోల్ ధరలు తగ్గాయని ఊరట లభించే లోగా.. పదిహేను రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. గత నెల 17న గ్యాస్ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి గ్యాస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ అవసరాల కోసం వాడే గ్యాస్ సిలిండర్ మీద రూ.25 పెంచాయి. వాణిజ్య అవసరాల కోసం వాడే గ్యాస్ సిలిండర్ పై రూ.75కి పెంచాయి. కాగా పెంచిన ధరలతో గృహ వినియోగాల కోసం వాడే సిలింర్ ధర రూ.884.50కి చేరగా.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.912కి చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి.