రోజు విడిచి రోజు.. ఏంటిలా? మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర

Petrol prices hiked again, diesel prices down after 2 months

Petrol prices hiked again, diesel prices down after 2 months

దేశంలో పెట్రోల్​ ధరలు మళ్లీ పెరిగాయి. రోజు విడిచి రోజు చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచుతున్నారు. తాజాగా పెట్రోల్ ధరలు పెరగగా.. డీజిల్​ ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. లీటర్​ పెట్రోల్​పై 28 పైసలు పెరిగింది. ఫలితంగా దేశ రాజధానిలో పెట్రోల్​ ధర లీటరుకు రూ.101.25 చేరింది. కాగా డీజిల్​పై 16 పైసలు తగ్గింది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 105.15 కాగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 97.79 లు గా ఉంది. ఏపీలోని గుంటూరులో లీటరు డీజిల్​పై​ 17 పైసలు తగ్గి రూ.99.49కు చేరింది. పెట్రోల్​ 28 పైసలు పెరిగి రూ.107.41గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 107.20, డీజిల్ 97.29, భోపాల్‌లో పెట్రోల్ ధ‌ర రూ. 109.53, డీజిల్ ధ‌ర రూ. 98.50, కోల్‌క‌తాలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 101.35 కాగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 92.81గా ఉన్నాయి.