ఫొటోని బట్టి మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవచ్చట!

మొఖం చూసి గుణం ఎలాంటిదో చెప్పేస్తా అనే మాట చాలాసార్లు వినే ఉంటారు. నిజానికి కొంతమందికి ఆ తెలివి ఉంటుంది. మనిషిని చూడగానే వారు ఎలాంటి వారో టక్కున చెప్పేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆల్ మోస్ట్ అలాంటిదే. ఈమధ్య సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ ఎక్కువయ్యాయి. అంటే ఒక ఫొటో చూపించి.. అందులో ఏం కనిపిస్తుంది అని అడగటం అన్నమాట. ఆ ఫొటోలోనన ఏం కనిపించిందో చెప్తే.. దాన్ని బట్టి మన ఆలోచనా విధానం, క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తారన్నమాట ఇల్యూజనర్స్. అలాంటిదే ఒక ఫొటో మీకోసం..

Personal Connected Health Alliance
ఎవరైనా మన గురించి మనకు తెలియని విషయాలు చెప్తుంటే.. నిజమా.. అవునా.. అని ఆశ్చర్యపోతుంటాం. అలాంటి లక్షణాలు ఇంకా ఏమేం ఉన్నాయో తెలుసుకోవాలనుకోవడం మనిషి లక్షణం. ఆప్టికల్ ఇల్యూజనర్స్ చేసేది కూడా అదే. ఒక ఫొటో చూపించి అందులో ఏం కనిపించిందో చెప్పడం వల్ల మనం ఏం ఆలోచిస్తున్నామో.. మన మైండ్ సెట్ ఏంటో చెప్పేస్తారన్నమాట. అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషనే కింది ఫొటో. ఫొటో చూశారుగా.. దాన్ని చూడగానే ఫస్ట్ మీకు ఏం కనిపించింది? ఓ అమ్మాయి తల వెనక నుంచి చూస్తున్నట్టు అనిపించిందా? లేక ముసలి వ్యక్తి తల కనిపించిందా? ఈ రెండింటిలో మీకే ఏది కనిపించింది అనే దాన్ని బట్టి మీ క్యారెక్టర్, ఆలోచనా విధానం ఏంటో చెప్పేస్తారన్నమాట. అదెలా అంటే..

అమ్మాయి ఫేస్ కనిపిస్తే..
ఫొటో చూడగానే మీకు అమ్మాయి తల కనిపించిందా.. అయితే మీరు ఆశావహ దృక్పథం తో ఉంటారన్నమాట. మీలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. ప్రతీ విషయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఇతరులకు సాయం చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఏదైనా అనుకుంటే వెంటనే అమలు చేసే రకం. ఉన్నట్టుండి నిర్ణయాలు తీసుకుంటారు. మీ చుట్టూ ఉన్న వారి సలహాలు, సూచనలు, ఫీడ్ బ్యాక్ తీసుకొని వర్కవుట్ చేస్తారు.

ముసలి వ్యక్తి మొఖం కనిపిస్తే..
ఫొటో చూడగానే ముందుగా మీసాలతో ఉన్న ముసలాయన తల కనిపించిందా? అయితే మీరు ప్రశాంతత, నిజాయితీ, నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ అన్నమాట. ఎదుటివారిని మీరు సులభంగా నమ్మేస్తారు. వారు కూడా మిమ్మల్ని నమ్ముతారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే.. దానికి పక్కా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతారు. మీరు సడెన్ నిర్ణయాలు తీసుకోరు. అన్నీ ఆలోచించిన తర్వాతే అడుగు ముందుకు వేస్తారు.