ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్

telangana high court

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్ పిల్ ధాఖలు చేశారు. ఏ చట్ట ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలో చెప్పాలంటూ పిటిషనర్ ని హైకోర్టు ప్రశ్నించింది.

ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపింది. జనవరి చివరి వరకు ధాన్యం కొనుగోలు చేస్తూనే ఉంటామని ఏజీ కోర్టుకు తెలిపారు.

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తూ చనిపోయిన 700 రైతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం.. ప్రతి రైతు కుటుంబాలకు 3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిదని హైకోర్టు గుర్తు చేసింది.

ఏజీ వాదనను పరిగణనలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు కు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. జనవరి మూడవ వారంలోపు కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశించింది.