8 లక్షల యాప్స్ మోసపూరితమేనవే.. మీరు డిలీట్ చేశారా? - TNews Telugu

8 లక్షల యాప్స్ మోసపూరితమేనవే.. మీరు డిలీట్ చేశారా?Playstore and apple Store Deleted 8 Lakhs Apps
Playstore and apple Store Deleted 8 Lakhs Apps

గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లలో మొత్తం 8 లక్షల యాప్స్ మోసపూరితమైన, హానికరమైనమేనట. ఈ మేరకు పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు గూగుల్, యాపిల్ స్టోర్లు ఆ యాప్స్ ని డిలీట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్ పేరుతో రూపొందించిన నివేదికలో ఈ యాప్స్ పేర్లను ప్రస్తావిచింది. కాగా మొత్తం 8 లక్షల 13 వేల మోసపూరిత యాప్స్ ఉన్నట్టు తేలింది. ఇవి కెమెరా, జీపీఎస్ ద్వారా యూజర్ డేటా సేకరిస్తున్నాయని నివేదికలో తేలింది. వీటిలో 86 శాతం 12 ఏండ్ల లోపు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులు చేయాలనే కుట్ర దాగుందని పిక్సలేట్ తెలిపింది.

Playstore and apple Store Deleted 8 Lakhs Apps
Playstore and apple Store Deleted 8 Lakhs Apps

కాగా.. ఈ యాప్స్ తొలగించడానికి యాప్ స్టోర్, ప్లేస్టోర్ లోని భద్రతాపరమైన నిబంధనలు ఉల్లంఘించడమేనని పిక్సలేట్ తెలిపింది. ఈ జాబితాను క్రియేట్ చేసే ముందు ప్లే స్టోర్, యాప్ స్టోర్ లలో మొత్తం 5 మిలియన్ల యాప్స్ ను పిక్సలేట్ రివ్యూ చేసింది. ఇందులో మొత్తం యాప్స్ కు 21 మిలియన్ల రివ్యూలున్నాయి. కాగా… నిషేధిత జాబితాలోని యాప్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వినియోగదారులున్నారని పిక్సలేట్ తెలిపింది. ఈ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ డిలీట్ చేసినా, నిషేధం విధించినా యూజర్ల ఫోన్లలో కొనసాగే ప్రమాదముందని పిక్సలేట్ నివేదిక చెప్తోంది. వ్యక్తిగత సమాచారం కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఆ యాప్స్ ని యూజర్లు వెంటనే డిలీట్ చేయాలని సూచించింది.