‘పాకెట్‌వ్యూ’ టెక్నాలజీ.. గూగుల్‌ మ్యాప్స్‌, నోటిఫికేషన్లు చూసేందుకు ఇకపై పోన్ తో పని లేదు - TNews Telugu

‘పాకెట్‌వ్యూ’ టెక్నాలజీ.. గూగుల్‌ మ్యాప్స్‌, నోటిఫికేషన్లు చూసేందుకు ఇకపై పోన్ తో పని లేదు‘PocketView’ technology ..

ఇకమీదట ఈ-మెయిల్‌ తదితర నోటిఫికేషన్లు,  గూగుల్‌ మ్యాప్స్ చూసేందుకు స్మార్ట్‌ఫోన్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్‌లూ పరిశోధకులు.. ‘పాకెట్‌వ్యూ’ టెక్నాలజీని ఆవిష్కరించారు. దీనితో మొబైల్‌ ఫోన్‌తో పనిలేకుండా వాతావరణ పరిస్థితి, సమయం, నోటిఫికేషన్లు వంటి ప్రాథమిక సమాచారం తెలుసుకోవచ్చు.

పాకెట్‌వ్యూ టెక్నాలజీతో మనం ధరించే దుస్తులు, ఇతర వస్త్రాలపై ఎల్‌ఈడీ కాంతుల రూపంలో సంక్షిప్త సమాచారం, నోటిఫికేషన్లను చూసుకోవచ్చని పరిశోధకులు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న, భవిష్యత్ లో వచ్చే ఎలక్ట్రానిక్ స్మార్ట్ పరికాలు ఈ టెక్నాలజీ సాయంతో మరింత మెరుగైన సేవలను వినియోగదారులకు అందించే అవకాశం ఉందని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.