యూట్యూబర్ శ్రీకాంత్ ని బట్టలిప్పి కొట్టిన కరాటే కళ్యాణి.. నడిరోడ్డుపై వీరంగం

Police complaint against Karate Kalyani
Police complaint against Karate Kalyani

ఏదో ఒక వివాదంతో నిరంతరం వార్తల్లో ఉండే వివాదాస్పద నటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కరాటే కళ్యాణి.. హిందూమత పరిరక్షణ పేరుతో వరుస వివాదాల్లో ఉంటూ వస్తోంది. తాజాగా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని నడిరోడ్డుపై గుడ్డలూడదీసి కొట్టి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. యూట్యూబ్‌లో ఫ్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు కరాటే కల్యాణి. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే తనపై. తన చేతిలో ఉన్న పాపపై దాడి చేశాడని కరాటే కల్యాణి ఆరోపిస్తున్నారు. ప్రాంక్ పేరుతో లేడీస్‌తో అసభ్యకరంగా ప్రవిస్తున్నట్టు కరాటే కళ్యాణి అతన్ని అడిగితే.. సదురు వ్యక్తి సరైన సమాధానం చెప్పుకుండా దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసినట్టు అక్కడ ఉన్న వారు చెప్పారు.

ఈ క్రమంలో మధురా నగర్‌ రోడ్డుపై కరాటే కళ్యాణి శ్రీకంతా రెడ్డిపై దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ విషయమై శ్రీకాంత్ రెడ్డి సమీపంలోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో కరాటే కళ్యాణి తనపై దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. మరోవైపు కరాటే కళ్యాణి అతనే తనపై దాడి చేసినందుకే ప్రతిఘటించానంటూ చెప్పుకొచ్చరు. ఈ క్రమంలో కరాటే కళ్యాణి.. శ్రీకాంత్ రెడ్డి పై అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే కరాటే కళ్యాణి.. శ్రీకాంత్ రెడ్డిని కొట్టడం గమనించిన ఓ వ్యక్తి కూడా తనతో కలిసి శ్రీకాంత్ మీద చేయి చేసుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన శ్రీకాంత్ తిరగబడ్డాడు. కరాటే కళ్యాణిని కొట్టి కింద పడేశాడు. ఇది చూసిన స్థానికులు శ్రీకాంత్‌ను చితకబాదారు. ఇంతలో కరాటే కళ్యాణి కూడా వారితో చేయి కలిపింది. శ్రీకాంత్ రెడ్డిని వెంబడించి మరీ కొట్టింది. ఆ సమయంలో శ్రీకాంత్ బట్టలు కూడా చినిగిపోయాయి.