సంగారెడ్డిలో ఏటీఎం చోరీకి య‌త్నం.. ఇద్ద‌రు అరెస్ట్ - TNews Telugu

సంగారెడ్డిలో ఏటీఎం చోరీకి య‌త్నం.. ఇద్ద‌రు అరెస్ట్Police have arrested two robbers who tried to rob an ATM in Sangareddy district

సంగారెడ్డి జిల్లాలో ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్ద‌రు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని జహీరాబాద్‌ మండలం రంజోల్ గ్రామంలోని ఇండ‌స్ ల్యాండ్ ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లడానికి ఆ దొంగలు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో షట్టర్‌ ఎత్తి ఏటీంఎం సెంటర్‌లోకి ప్రవేశించిన ఆ కిలాడీలు.. గడ్డపారతో ఏటీఎం మిషన్‌, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే అటుగా వచ్చిన పెట్రోలింగ్‌ పోలీసులు ఏటీఎం సెంటర్‌ షెట్టర్‌ ఎత్తి ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో చోరీకి యత్నిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సంగారెడ్డి జిల్లా కోహీర్‌ వాసులుగా గుర్తించారు. నిందితులుపై కేసు నమోదుచేశారు.