మీ రాజకీయాలకోసం.. మా జీవితాలని నాశనం చేయకండి.. పూనమ్ సంచలన కామెంట్స్..!

poonam kaur sensational comments about maa elections
poonam kaur sensational comments about maa elections
poonam kaur sensational comments about maa elections
poonam kaur sensational comments about maa elections

మా ఎన్నికల క్లైమాక్స్ వచ్చేసింది. ఈ రోజు ఉదయం మొదలైన మా ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3గంలకు ముగిసిన మా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 620 ఓట్లు పోలైనట్టు చెప్తున్నారు. మోహన్ బాబు స్వయంగా ఎన్నికల పర్వాన్ని దెగ్గరుండీ చూస్తున్నాడు. అక్కడ కోలాహలమంతా మంచు విష్ణుదే. ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్ సభ్యులు కొంచం తక్కువ హడావిడితోనే కనిపించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున,రామ్ చరణ్,నాని వంటి ప్రముఖులంతా తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు పరిస్థితులు అదుపులోనే ఉండగా.. వారు వెళ్లిన తరువాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఉన్నట్టుండి ‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.  దాంతో కాసేపు పోలింగ్‌ను ఆపేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు ప్యానెల్ తరపున మంచు మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. బెనర్జీకి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ హీటెడ్ ఇన్సిడెంట్స్ కి పూనమ్ కౌర్ కామెంట్స్ మరింత అగ్గిని రాజేస్తోంది. పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలతో గతకొద్దికాలంగా ట్రెండ్ అవుతున్న పేరు పంజాబీ గర్ల్. ఇండస్ట్రీలో ఒక పంజాబీ గర్ల్ కి కడుపు చేశారు.. ముందు               ఆ అమ్మాయిని కాపాడు అంటూ పవన్ పై పోసాని విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఆ తరువాత వరుస అనుమానాస్పద ట్వీట్స్ తో పూనమ్ కౌర్ కూడా వార్తల్లో నిలిచింది. తాజాగా మా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన పూనమ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రకాష్ రాజ్ గెలిస్తే తనకి జరిగిన అన్యాయాల్ని బయటపెడతానంటూ చెప్పిన పూనమ్ మా ఎన్నికల్లో ఓటు వేసి, ఓపెన్ గా ప్రకాష్ రాజ్ కి మద్దత్తు ప్రకటించింది. ‘నేను మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా అదే ప్రమోషన్ చేశాను. ఇక తమ రాజకీయ లబ్ధి కోసం నటీనటులను వాడుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ గెలిచినా, మంచు విష్ణు గెలిచినా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. రాజకీయాల కోసం ఆర్టిస్టులను సతాయించడం మానేయాలి అని కోరుతున్నా.’’ అంటూ పూనమ్ కౌర్ మళ్ళీ ఇన్ డైరెక్ట్ గా ఎవర్నో అటాక్ చేస్తున్నట్టు కామెంట్స్ చేసింది.