జుట్టు పట్టి గోడకేసి.. విచక్షణారహితంగా కొట్టిన భర్త.. తీవ్ర గాయాలపాలైన పూనమ్ పాండే.. అసలేం జరిగిందంటే ?

Poonam Pandey Husband Sam Bombay Arrested For Physically Assaulting Her
Poonam Pandey Husband Sam Bombay Arrested For Physically Assaulting Her
Poonam Pandey Husband Sam Bombay Arrested For Physically Assaulting Her
Poonam Pandey Husband Sam Bombay Arrested For Physically Assaulting Her

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. తన భర్త విచక్షణారహితంగా కొట్టిన సంఘటనని స్వయంగా తెలియచేసింది పూనమ్. తానూ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైనట్టు.. ఆల్మోస్ట్ తనపై హత్య యత్నం జరిగినట్టు వాపోయింది పూనమ్ పాండే. దీంతో పూనమ్ పాండే భర్త సామ్‌ బాంబే పై కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. పూనమ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సామ్ బాంబేని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ గొడవలకి సామ్ బాంబే మొదటి భార్యనే కారణమని తెలుస్తుంది. వారిద్దరి విడిపోయినా ఇంకా మాజీ భార్యతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని పూనమ్ పాండే నిత్యం భర్తతో గొడవలకి దిగేదట. తరచుగా తన మొదటి భార్యతో తనముందే ఫోన్లు మాట్లాడుతుండటంపై ఇద్దరికి వాగ్వాదం జరిగేది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్‌ బాంబే..పూనమ్‌ను జుట్టు పట్టుకొని తలను గోడకేసి కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్‌ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.

ఇక ఈ గొడవ మొదట్లో పోలీసు స్టేషన్ వరకు వెళ్ళింది. అయితే భర్త ఏడుస్తూ పూనమ్ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడడంతో కేసు వాపసు తీసుకుంది పూనమ్. అయితే విడుదలయ్యాకా కొద్దిరోజులు బాగానే కాపురం చేసినా.. మళ్ళీ మాజీ భార్యతో సామ్‌ బాంబే సంబంధాలు కొనసాగించడంపై సీరియస్ అయ్యింది పూనమ్. దాంతో విచక్షణ కోల్పోయిన సామ్.. పూనమ్ ని చితకబాదాడని తెలుస్తుంది. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్‌1న పూనమ్‌-శామ్‌ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటం మొదలయ్యానని పోలీసులు అంటున్నారు. అయితే తాజాగా తన భర్త చేసిన దాడి గురించి పూనమ్ స్వయంగా స్పందిస్తూ.. ‘ ఇది మొదటిసారి కాదు. నన్ను కొట్టడం అతనికి అలవాటుగా మారింది. ప్రతిసారి కొట్టడం.. ఏడుస్తూ క్షమాపణలు కోరటం.. నేను కరిగిపోయి మన్నించటం జరుగుతూవస్తున్నాయి. అయితే ఈ సారి హద్దులు దాటి నన్ను విచక్షణారహితంగా కొట్టాడు. సగం హత్య చేసినంత పనిచేశాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది పూనమ్ పాండే.