అందుకే ప్రభాస్ గ్రేట్.. బన్నీ, చరణ్, మహేష్ లు కాదన్నా.. ఆ ఒక్క కారణంతోనే అర్జున్ రెడ్డికి అవకాశమిచ్చాడా.. !

prabhas confirms sandeep reddy spirit movie mahesh charan bunny rejected the story line
prabhas confirms sandeep reddy spirit movie mahesh charan bunny rejected the story line
prabhas confirms sandeep reddy spirit movie mahesh charan bunny rejected the story line
prabhas confirms sandeep reddy spirit movie

వరుస ఫ్యాన్ ఇండియా చిత్రాలతో తన కెరీర్ లోనే అత్యున్నత ఫార్మ్ లో ఉన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బాలీవుడ్ ఖన్స్ అమీర్, షారుఖ్, సల్మాన్ లను మించిన రెమ్యునరేషన్స్ తో ఇండియాలోనే టాప్ హీరోగా అవతరించాడు. తాజాగా ‘రావణ్’ కోసం ప్రభాస్ ఏకంగా 300కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు.. ఇది ఇండియాలోనే ఆల్ టైం రికార్డ్ అని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో తన 25వ సినిమాపై సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రభాస్. ఇప్పటికే ఓ నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్’లో పెట్టిన ప్రభాస్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కూడా సినిమా చేయబోతున్నాడు. స్పిరిట్ అని వర్కింగ్ టైటిల్ కూడా అనౌన్స్ చేసేశారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి సంబదించిన టైటిల్ ఫస్ట్ లుక్ కూడా విడుదలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సంచలనాల సందీప్ రెడ్డి చెప్పిన స్పిరిట్ స్ట్రోరిని టాలీవుడ్ లోని టాప్ 3 హీరోస్ రిజెక్ట్ చేశారని.. వారు ఒద్దనుకున్న సబ్జెక్ట్ ని ప్రభాస్ సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేసేశాడట.

ఇప్పటివరకు రాజమౌళి సినిమాలనే అలా ఒకే చెప్పారట ప్రభాస్. బాహుబలి తరువాత కథల విషయాల్లో ఆచితూచి వ్యవరిస్తున్న ప్రభాస్ స్పిరిట్ కథని సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేయటం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఈ కథని బన్నీ, చరణ్, మహేష్ బాబులు రిజెక్ట్ చేసారు కాబట్టి. మొదలు మహేష్ బాబుకి ఈ కథ చెప్పాగా ఆ తరువాత బన్నీ వద్దకు ఈ కథ వెళ్లిందట. ఇద్దరు కొన్ని కారణాల వల్ల ఈ కథని చేయలేకపోవటంతో.. రామ్ చరణ్ కి కథ వినిపించాడట సందీప్. లైన్ చరణ్ కి నచ్చినా.. స్టోరీలో కొన్ని కీలక మార్పులు అడిగాడట చరణ్.               ఆ మార్పులకి ఒప్పుకొని సందీప్ చరణ్ తో డీల్ క్యాన్సిల్ చేసుకుని ప్రభాస్ తో డేట్ ఫిక్స్ చేకున్నాడట. అయితే డైరెక్టర్స్ ని గుడ్డిగా నమ్మే ప్రభాస్, సందీప్ రెడ్డి టేకింగ్ పై నమ్మకంతోనే ఎలాంటి మార్పులు అడకకుండా ఈ స్పిరిట్ కథని తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా చేయబోతున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్స్ ని అంతలా నమ్ముతాడు కాబట్టే.. కథలో అనవసరంగా వేలు పెట్టడు కనుకనే .. ప్రభాస్ కి ఇంతమంచి ఆఫర్స్ వస్తున్నాయని.. కథని, దర్శకుడిని పూర్తిగా నమ్మడం కారణంగానే ఇప్పుడు ప్రభాస్ ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఒకరేంజిలో పొగుడుతున్నారు.